1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మహేష్ బాబు, త్రివిక్రమ్ భారీ చిత్రం ప్రారంభం!

వినోదం వెండితెర కథనాలు మహేష్ బాబు త్రివిక్రమ్ భారీ చిత్రం ప్రారంభం శింగనమల రమేష్ బాబు అనుష్క అతడు పోకిరి
WD
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, స్టార్ రైటర్, డైరక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో "అతడు" తర్వాత చేస్తోన్న మరో భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 25న అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.

ఎస్. సత్యరామమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ "ప్రొడక్షన్ నెం.2"లో మహేష్ బాబు సరసన ప్రముఖ హీరోయిన్ అనుష్క కథానాయికగా నటిస్తోంది.

ఈ చిత్రం గురించి యంగ్ స్టార్ మహేష్ బాబు చెబుతూ.. "అతడు" వంటి హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్ చెప్పిన ఈ సబ్జెక్ట్ తనకు ఎంతో బాగా నచ్చిందని, కథ విని ఇన్‌స్పైర్ అయి ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేస్తున్నానన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను అలరించే అన్ని అంశాలతో, అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోందని మహేష్ బాబు తెలిపారు.

మహేష్ బాబుతో కలిసి చేస్తున్న తొలి చిత్రమిదని హీరోయిన్ అనుష్క చెప్పారు. సబ్జెక్ట్ చాలా ఆసక్తికరంగా ఉందని, త్రివిక్రమ్ దర్శకత్వంలో పనిచేయడం హ్యాపీగా ఉందన్నారు.

నిర్మాత శింగనమల రమేష్ బాబు మాట్లాడుతూ.. మహేష్, త్రివిక్రమ్ సూపర్ కాంబినేషన్‌లో సెన్సేషనల్ హిట్ తీయాలన్న అభిప్రాయంతో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. మార్చి 25 నుంచి జూన్ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్తో సగం సినిమా పూర్తవుతుందని రమేష్ బాబు తెలిపారు.

ఈ షెడ్యూల్ కోసం గండిపేట దగ్గర రెండు కోట్ల రూపాయల వ్యయంతో విలేజ్‌ నిర్మిస్తున్నామన్నారు. అలాగే అత్యంత వ్యయంతో రాజస్థాన్ టెంపుల్ సెట్ వేస్తున్నామని, తెలుగు సినిమా చరిత్పలోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందే ఈ సినిమా షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలోని నమీబియాలో, ఆగస్ట్ షెడ్యూల్ రాజస్థాన్‌లో, సెప్టెంబర్‌లో ఇటలీలో సాంగ్స్ చిత్రీకరించడంతో దాదాపు షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత వివరించారు.

"పోకిరి"తో రికార్డులు సృష్టించిన మహేష్ బాబు, అరుంధతితో రికార్డులు సృష్టించిన అనుష్క, జల్సాతో రికార్డులు కొట్టేసిన త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తమ కనకరత్న మూవీస్ బేనర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్నారు.

ఇకపోతే.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రాజకుమారుడు, మురారి, ఒక్కడు, అతడు, పోకిరి వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం సమకూర్చుతున్నారు.

మహేష్ బాబు, అనుష్క జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ బ్రహ్మానంద్, సునీల్, వేణుమాధవ్, ఆలీ, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, షఫీ, సుశీల్ శర్మ, సుధ, శ్రీ రంజని తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం.. మణిశర్మ, ఫోటోగ్రఫీ.. సునీల్ పటేల్, ఫైట్స్.. విజయన్, ఎడిటింగ్.. శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్.. ఆనంద్‌ సాయి, స్టిల్స్.. దాస్, కో-డైరక్టర్స్.. జాస్తి హేమాంబర్, రవికిరణ్, ఎగ్టిక్యూటివ్ ప్రొడ్యూసర్.. బి. బుల్లి సుబ్బారావు, సమర్పణ.. ఎస్. సత్యరామమూర్తి.
About Writer
SELVI.M