1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

31న ప్రభాస్-పూరి జగన్నాథ్‌ల కొత్త చిత్రం!

వినోదం వెండితెర కథనాలు యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ పూరి జగన్నాథ్ కొత్త చిత్రం మార్చి 31 ఆదిత్యారామ్ జూలై కంగనా రనౌత్
WD
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న భారీ చిత్రం ఈ నెల (మార్చి 31) నుంచి ప్రారంభం కానుంది. ఆదిత్యారామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్, ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఈ నెల 31 నుంచి ఏకధాటిగా జూలై వరకు షూటింగ్ జరుపుకోనుంది.

ఈ చిత్రం గురించి డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ చెబుతూ.. ప్రభాస్‌తో చేస్తున్న మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇదన్నారు. అన్ని ఎమోషన్స్ మిక్స్ అయిన పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో రూపొందుతోన్న స్టైలిష్ ఫిలిమ్ ఇదని పూరి వివరించారు. జూలై నెలాఖరు కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని, ఆదిత్యరామ్ పతాకంపై తన సమర్పణలో ఈ చిత్రం తయారవుతుందని పూరి అన్నారు.

యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జంటగా నటిస్తోన్న ఈ భారీ చిత్రానికి సమర్పణ.. పూరి జగన్నాథ్, నిర్మాత.. ఆదిత్యారామ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం.. పూరి జగన్నాథ్.
About Writer
SELVI.M