1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పాటల చిత్రీకరణలో "రాజుమహారాజు"

వినోదం వెండితెర కథనాలు పాటల చిత్రీకరణ రాజుమహారాజు శర్వానంద్ సుర్విన్ చావ్లా తషు కౌశిక్ రమ్యకృష్ణ భాను
WD
శర్వానంద్, సుర్విన్ చావ్లా, తషు కౌశిక్ హీరోహీరోయిన్లుగా, డా. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం "రాజు మహారాజు". కుమారస్వామి పత్తికొండ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భాను దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం టాకీని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కులుమనాలిలో పాటలను చిత్రీకరించుకుంటోంది.

త్వరలో ఈ సినిమాలోని పాటలను విడుదల తేసి ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు అన్నారు. మనిషి ఉనికిని చాటడానికి కుటుంబం అవసరమని, ఆ కుటుంబానికి ప్రాధాన్యత నిచ్చే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు.

మోహన్ బాబు సరసన రమ్యకృష్ణ నటిస్తోందని, చక్రి చక్కని బాణీలు సమకూర్చారని దర్శకుడు చెప్పారు. ఈ సోమవారం నుంచి మోహన్ బాబుపై ఓ పాటను చిత్రీకరించడం ప్రారంభించామని ఆయన వివరించారు.
About Writer
SELVI.M