లైఫ్స్టైల్ ఆడియో విడుదల
|
ఆడియో విడుదల సందర్భంగా సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ముప్పలనేని శివ కోడైరక్టర్ నుంచే తనకు తెలుసునని, తాను కూడా కో డైరక్టర్‌గా పనిచేశానని, ఒక నిబద్ధతతో ముందుకుసాగుతున్న ముప్పలనేని శివకు ఈ చిత్రంతో లైఫ్‌స్టైల్ మారిపోవాలని అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ.. మంచి టైటిల్‌తో ముప్పులనేని సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని, అందరూ కొత్తవారితో చేస్తున్న ఈ సినిమా నేటి ట్రెండ్‌కు తగినట్లు హిట్ కావాలని ఆశించారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ముప్పులనేని శివకు మ్యూజిక్ సెన్సె ఉందని, ఆయన గత చిత్రాలన్నీ మ్యూజికల్స్ హిట్టేనని, అదే కోవలో ఈ సినిమా కూడా విజయవంతమౌతోందని చెప్పారు. ఇందులో ఏడు పాటలున్నాయని, అన్నీ సందర్భానికి అనుగుణంగా ఉంటాయని సంగీత దర్శకురాలు శ్రీజ వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రంలో నిశ్చల్, కార్తీక్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతుండగా, కార్తీక్, అభిరామ్, మీనాక్షి దీక్షిత్, అనన్య యశ్వంత్ తదితరులు నటిస్తున్నారు.