1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"రాజు మహారాజు" షూటింగ్ పూర్తి

వినోదం వెండితెర కథనాలు రాజు మహారాజు షూటింగ్ పూర్తి మోహన్బాబు రమ్యకృష్ణ శర్వానంద్ భాను కుమార స్వామి
WD
మోహన్‌బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా, శర్వానంద్ హీరోగా నటిస్తోన్న "రాజు మహారాజు" చిత్రం బుధవారంతో పూర్తయిందని చిత్ర నిర్మాత కుమార స్వామి తెలిపారు. ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహిస్తున్నారు.

బుధవారం సారధి స్టూడియోస్‌లో చివరి గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో మోహన్‌బాబు, రమ్యకృష్ణ, కౌషు కౌశిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. కుటుంబకథా చిత్రమిదని, కొత్త నిర్మాత అయినా చెప్పింది.. చెప్పినట్లు తీస్తున్నారని చెప్పారు.

గతంలో ఆయన తన పతాకంపై పలు చిత్రాలకు పనిచేశాడని వెల్లడించారు. ఇక చిత్ర విజయమనేదీ దైవాదీనమని, రమ్యకృష్ణతో చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్నానని, ఇందులో శర్వానంద్ అన్నగా నటిస్తున్నానని మోహన్ బాబు చెప్పారు.

రమ్యకృష్ణ మాట్లాడుతూ.. మోహన్ బాబుది తనది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అని, చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్నామని వెల్లడించారు. సినిమా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకముందని చెప్పారు.

మోహన్ బాబు తమ బేనర్‌లో నటించడం వందరోజులు ఆడినంత ఆనందంగా ఉందని నిర్మాత కుమార స్వామి తెలిపారు. దీని ద్వారా తమ బేనర్‌కు మంచి వ్యాల్యూ వచ్చిందని ఆయన అన్నారు.

శర్వానంద్, రమ్యకృష్ణ అనుకున్న టైమ్‌కు షూటింగ్‌కు వచ్చారని, అంతా ఫ్యామిలీలా ఉన్నామని నిర్మాత తెలిపారు. త్వరలో ఈ సినిమా ఆడియోను విడుదల చేస్తామని, వచ్చేనెలలో సినిమాను విడుదల చేస్తామని ఆయన వివరాలందించారు.