1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"అష్టాచమ్మా" ఫేం శ్రీనివాస్ హీరోగా "నాట్‌లక్కీ"

వినోదం వెండితెర కథనాలు అష్టాచమ్మా ఫేం శ్రీనివాస్ హీరో నాట్లక్కీ కూచిపూడి వెంకట్ సతీష్ చంద్ర ఓం కిరణ్ వారణాసి
WD
"అష్టాచమ్మా" ఫేం అవసరాల శ్రీనివాస్ హీరోగా, కూచిపూడి వెంకట్ దర్శకత్వంలో "నాట్ లక్కీ" అనే చిత్రం రూపొందుతోంది. అట్లాంటాలో స్థిరపడిన భారతీయుడు సతీష్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు కూచిపూడి వెంకట్ మాట్లాడుతూ.. "అష్టాచమ్మా"తో నటుడిగా మంచిపేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ హీరోగా చక్కని కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిదన్నారు. ప్రముఖ దర్శకుడు నీలకంఠ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయబోతున్నామని వెంకట్ వెల్లడించారు.

ఓం అనే యువనటుడు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని, 90 శాతం అమెరికాలో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం జూన్‌లో ప్రారంభమై సింగిల్ షెడ్యూల్‌తో పూర్తవుతుందని వెంకట్ తెలిపారు.

ఇంకా ఈ చిత్రానికి సంగీతం.. కిరణ్ వారణాసి, నిర్మాత.. సతీష్ చంద్ర, కథ, మాటలు, దర్శకత్వం.. కూచిపూడి వెంకట్.
About Writer
SELVI.M