తొందరెక్కువైన ''మిత్రుడు'': నెట్‌లో హల్‌ఛల్
|
అసలు ఈ సాంగ్ ఎలా నెట్‌లోకి వచ్చిందన్న విషయం అంతుబట్ట లేకపోతున్నామంటూ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సైతం తలపట్టుకుంటున్నారు. ఈమధ్య అస్సలు హిట్స్ లేకుండా మొహం వాచిపోయిన బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఇలా నెట్‌లో దర్శనమివ్వడంపై చిత్ర యూనిట్ మండిపడుతోంది.
మహాదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మిత్రుడు చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి సంబంధించి అత్యంత భారీ ఖర్చుతో చిత్రీకరించబడినట్టు తెలుస్తున్న 'బాల బాల కృష్ణా' అంటూ సాగే ఈ పాట, కాస్త మసక మసకగానైనా సరే నెట్‌లో పూర్తి నిడివిలో దర్శనమిస్తుండడంతో బాలకృష్ణ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ చూసేందుకు ఎగబడుతున్నట్టు సమాచారం.
ఇక నెట్‌లో దర్శనమిస్తోన్న ఈ సాంగ్ వివరాలను ఓసారి పరికిస్తే... బాలకృష్ణపై చిత్రీకరించబడిన ఈ సాంగ్ బార్ నేపథ్యంలో సాగుతోంది. ఈ పాటలో మంచి హూషారుగా స్టెప్పులేస్తున్న బాలకృష్ణ పుల్ బాటిల్‌ను పైకెత్తి అమాంతం తాగేస్తుంటే చుట్టూ ఉన్న అమ్మాయిలంతా ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంతేకాదండోయ్ ఈ సాంగ్‌లో బాలకృష్ణ అందంగానూ, ఎనర్జిటిక్‌గానూ కనిపిస్తుండడం మరో విశేషం.