1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. జూబ్లీహిల్స్‌లో "పిస్తా" షూటింగ్

జూబ్లీహిల్స్‌లో "పిస్తా" షూటింగ్

వినోదం వెండితెర కథనాలు జూబ్లీహిల్స్ విశాల్ పిస్తా షూటింగ్ భరణి పొగరు సత్యం జికె ఫిలింస్ కార్పొరేషన్
భరణి, పొగరు, సత్యం ఫేమ్ విశాల్ కథానాయకుడిగా, జి.కె. ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం "పిస్తా". ఈ చిత్రం తాజా షెడ్యూల్ జూబ్లీహిల్స్‌లో ప్రారంభమైంది.

రామానాయుడు ఆడిటోరియంలో షిండే, జయప్రకాష్ రెడ్డి, విశాల్‌లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రాజకీయ నాయకులు ఉపన్యాసం ఇచ్చే సన్నివేశంలో విశాల్ వచ్చి అవాంతరం కల్గించే సన్నివేశమది. యాక్షన్, సెంటిమెంట్, లవ్ వంటి అన్నీ అంశాలతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి విక్రమ్ కృష్ణ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.