1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. జగపతిబాబు, ప్రియమణిల "ప్రవరాఖ్యుడు"

Comes again Jagapathy babu, Priyamani combination | జగపతిబాబు, ప్రియమణిల "ప్రవరాఖ్యుడు"

వినోదం వెండితెర కథనాలు జగపతిబాబు ప్రియమణి ప్రవరాఖ్యుడు ఆ నలుగురు పెళ్లైన కొత్తలో టాలీ టు హాలీ ఫిలింస్
WD
మహిళా ప్రేక్షకుల్లో విశేష అభిమానం చూరగొన్న కథానాయకుడు జగపతిబాబు హీరోగా, ప్రియమణి కథానాయికగా "ఆ నలుగురు" వంటి ఉత్తమ చిత్రానికి రచన చేసిన మదన్ దర్శకత్వంలో "ప్రవరాఖ్యుడు" అనే సినిమా రూపొందుతోంది. జగపతిబాబు, ప్రియమణిల కాంబినేషన్‌లో "పెళ్లైన కొత్తలో" చిత్రం ద్వారా సక్సెస్ దర్శకుడిగా మారిన మదన్ తాజాగా దర్శకత్వ బాధ్యతలు వహించడం ఈ సినిమా విశేషం.

"టాలీ టు హాలీ ఫిలింస్" సంస్థపై ద్వితీయ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్‌ను మేలో ప్రారంభిస్తామని సహ నిర్మాత సుధాకర్ చాగంటి తెలిపారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూర్చనున్నారని, కామెడీ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు.

ఇంకా ఈ సినిమాకు కెమేరా.. సురేందర్ రెడ్డి, ఎడిటింగ్.. ఎ.ఆర్. వర్మ. నిర్మాత.. గణేష్ ఇందుకూరి.