1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. రామాంజనేయ ఫిలింస్ రికార్డింగ్ ప్రారంభం

Ramanjaneya films in recording | రామాంజనేయ ఫిలింస్ రికార్డింగ్ ప్రారంభం

వినోదం వెండితెర కథనాలు రామాంజనేయ ఫిలింస్ రికార్డింగ్ ప్రారంభం పవన్తేజ ప్రీతమ్ హీరోయిన్ క్లాసికల్ డాన్సర్ ప్రేమ వివాహం
జై శ్రీరామాంజనేయ ఫిలింస్ పతాకంపై చదలవాడ హరికృష్ణ, పవన్‌తేజ, ప్రీతమ్ హీరోలుగా నిర్మిస్తోన్న తాజా చిత్రం పాటల రికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జింకా హరీష్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న యధార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని ఒక చిన్న మార్పుకోసం ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ క్లాసికల్ డాన్సర్‌ పాత్రను పోషిస్తోందని తెలిపారు.

ఈ సమాజంలోని 100 శాతంలో 75 శాతం ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. అందులో 50శాతం వివాహాలు విడాకులకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో... పెద్దలు నిశ్చయించిన పెళ్లి గొప్పదా? ప్రేమ వివాహాలు గొప్పవా? అనే పాయింట్‌తో సినిమాను నిర్మిస్తున్నామన్నారు.

నిర్మాత జక్కుల సంధ్య మాట్లాడుతూ.. కథ బాగా నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని, ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఇంకా ఈ సినిమాకు సంగీతం. మోహన్ సాదు, కెమేరా... భాస్కర పట్ల మురళీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. జింకా హరీష్ బాబు.
About Writer
SELVI.M