Paruchuri Drama festival in Vizag | వైజాగ్‌లో పరుచూరి నాటకోత్సవాలు
పరుచూరి రఘుబాబు 19వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు ఈ నెల 27 నుంచి మే 1వరకు విశాఖపట్నంలో జరుగుతాయని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. జాతీయ స్థాయిలో ప్రదర్శించిన నాటికనాటకాలను పరిశీలించిన న్యాయ నిర్ణేతలు 14 నాటికలు, 8 నాటకాలను ఎంపికచేసినట్లు పేర్కొన్నారు.
మే 1వ తేదీన జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో డి. రామానాయుడు, సి. నారాయణ రెడ్డితో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు పరుచూరి తెలిపారు. ఈ నాటకోత్సవాలను వైజాగ్‌కు చెందిన వెలుగోడి ట్రస్ట్, శ్రీ మిత్ర రియల్ ఎస్టేట్ సంస్థలు పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉత్తమ నాటికలు, నాటకాలను హైదరాబాద్ నాటక ప్రియులుకూడా చూసేందుకు రఘుబాబు వర్థంతి సెప్టెంబర్ 6న రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పేర్రొన్నారు.
ఈ విషయమై నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సినీ రంగానికి వంతెనలా ఏర్పడి ఎంతోమంది కళాకారులను వెలుగులోకి తెచ్చిన పరిషత్‌ను అభినందించారు.