voting right is very important for citizen: Prakash Raj | ఓటు హక్కు అమూల్యమైంది: ప్రకాష్ రాజ్
టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన విలక్షణ నటనతో అలరిస్తోన్న నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ప్రకాష్ రాజ్ నటించిన "ఆకాశమంత" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో త్రిషకు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారు. తండ్రీ, కూతుళ్ల అనురాగానికి అద్దం పట్టే ఈ సినిమా విడుదలైన సందర్భంగా ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు.
దేశంలో ఎన్నికల హడావుడి వేడెక్కుతోన్న నేపథ్యంలో.. భారత పౌరునిగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రకాష్ రాజ్ సూచించారు. లేదంటే 40, 45 శాతం ఓటింగ్‌తో మనకు ఇష్టంలేని వ్యక్తిని నెత్తిన పెట్టుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. తనకు హైదరాబాద్‌లోనూ, చెన్నైలోనూ ఓటు హక్కు ఉందని, ఈసారి హైదరాబాద్‌లోనే ఓటు వేస్తానని ప్రకాష్ రాజ్ చెప్పారు. కానీ ఎవరికి అనేది వ్యక్తిగతం కనుక చెప్పనని ఆయన వెల్లడించారు.
రాజకీయ ప్రవేశం గురించి అడిగిన ప్రశ్నకు ప్రకాష్ రాజ్ సమాధానమిస్తూ.. రాజకీయాల్లోకి రావాలని తనకు ప్రస్తుతం ఆలోచన, తీరిక లేదంటూ.. అబద్ధాలు చెప్పే సమయం లేదని చమత్కరించారు. ఈనాటి ప్రజలు చాలా తెలివైన వారని, వారికి తమ నాయకుడు ఎలా ఉండాలో బాగా తెలుసునని ఆయన అన్నారు.
తమిళంలో తానే నిర్మించిన "అభియుమ్ నానుమ్" (తెలుగులో ఆకాశమంత), తెలుగులో దిల్‌రాజు నిర్మించారు. ప్రమోషన్‌లో భాగంగాతో మీడియాతో పైవిధంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్, తమిళంలో మాదిరి తెలుగులోనూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తండ్రి, కూతురు సంబంధాలు ఎలా ఉంటాయో తండ్రిగా తనకు, నిర్మాత దిల్‌రాజుకు తెలుసునని, ఇది ప్రతి ఒక్క తండ్రికి ఎదురయ్యే సంఘటన అని, కనుక తప్పకుండా ఈ సినిమాను చూడాలని ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేశారు.