Romio in Re-recording Part | రీరికార్డింగ్‌లో "రోమియో"
శ్రీహరి ప్రధాన పాత్రలో ఆర్యన్ రాజేష్ కథానాయకుడిగా నటించిన "రోమియో" చిత్రం రీరికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోందని సంగీత దర్శకుడు అగస్త్య తెలియజేశారు. ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయని, వేటికవే వైవిధ్యంతో కూడినవని అగస్త్య చెప్పారు.
గీత రచయిత వనమాలి మాట్లాడుతూ.. రోమియో అంటే పిచ్చివేషాలు వేసేవాడనుకుంటారని, కానీ ఈ రోమియోకు బాధ్యత ఉంటుందని, అది ఏమిటనేదే సినిమా అని వెల్లడించారు.
ఇందులో ఐదు పాటలు రాశానని, "పెళ్లయిన కొత్తలో" సినిమా తర్వాత అగస్త్యతో చేస్తున్న చిత్రమిదన్నారు. ఇందులో స్పానిష్ శైలిలో చక్కని పాట ఒకటి ఉందని, అది సినిమాకు హైలైట్ అవుతుందని వనమాలి వెల్లడించారు.
శ్రీహరి మాట్లాడుతూ.. కథంతా తన పాత్ర చుట్టూ తిరుగుతుందని, స్క్రీన్‌ప్లే బేస్డ్ చిత్రమిదని, రాజేష్ చాలా బాగా చేశాడని అన్నారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు సంపాదించిపెడుతుందని, వి.వి.వినాయక్, ఆదిత్య, బెల్లంకొండ సురేష్ తదితరులు మాట్లాడుతూ.. హీరోగా ఉండి శ్రీహరి క్యారెక్టర్ పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో మంచి వాతావరణాన్ని నెలకొల్పారని ప్రశంసించారు.
కథ వినగానే చాలా వైవిధ్యంగా ఉందనిపించిందని, శ్రీహరి అంగీకరించకపోతే ఈ సినిమాను నిర్మాత తీసేవారు కాదని హీరో రాజేష్ అన్నారు.