Shayaji Shinde Rathri Audio release | షాయాజీ షిండే "రాత్రి" ఆడియో విడుదల
|
ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. మంచి నటుడిగా షాయాజీ షిండే నటిస్తూ ప్రముఖుల జాబితాలో చేరాడని, గతంలో తాను నిర్మించిన చిత్రంలోనూ నటించాడని చెప్పారు. అతనికి మంచి భవిష్యత్ ఉందని తమ్మారెడ్డి వెల్లడించారు.
ఏవీఎస్ మాట్లాడుతూ... హారర్ చిత్రాలకు ఆదరణ వస్తున్న తరుణంలో ఇటువంటి చిత్రాలు రావడం చాలా మంచిదన్నారు. చిన్న చిన్న చిత్రాలు చేయడం విడుదల చేయడం సాహసంతో కూడిన పని అని, ప్రస్తుతం థియేటర్లు దొరకడం లేదని చిత్ర నిర్మాత ఆర్. కిరణ్ కుమార్ అన్నారు. ఇలాంటి తరుణంలో షిండే ఈ సినిమా చేస్తానని ముందుకు రావడం సగం విజయంతో సమానమని, ఆయన వల్లే ఈ చిత్రం విజయవంతమవుతుందనే నమ్మకముందన్నారు.