చెన్నైలో స్కై డిజిటల్ కలర్ ల్యాబ్ ప్రారంభం
తమిళ చిత్ర పరిశ్రమకు (కోలీవుడ్)కు ప్రధాన కేంద్రంగా ఉండే తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో స్కై డిజిటల్ కలర్ ల్యాబ్ అండ్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. హాలీవుడ్‌కు అమెరికా, బాలీవుడ్‌కు ముంబై, టాలీవుడ్‌కు చెన్నైలను హార్ట్ ఆఫ్ సిటీలుగా పేర్కొంటారు. అలా కోలీవుడ్ చిత్ర పరిశ్రమ కొలువుదీరిన చెన్నై చిత్ర పరిశ్రమ సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేలా ఈ స్కై డిజిటల్ కలర్ ల్యాబ్ అండ్ స్టూడియోను నెలకొల్పారు.
దీనిపై స్టూడియో సీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ. ఈ రంగంలో పలు సంవత్సరాల అనుభవం తమ సొంతమన్నారు. అందువల్లే అల్ట్రా మోడరన్ స్టూడియోను నెలకొల్పినట్టు చెప్పారు. ఈ భారీ ప్రాజెక్టుకు మేనేజింగ్ పార్టనర్ రమేష్, డైరక్టర్లు జేవియర్, తంగయ్యన్, వినోద్, వెంకటేశన్‌లు తమ వంతు సహాకారం అందించారని తెలిపారు. స్టూడియోను 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తిస్థాయిలో ఏసీ సౌకర్యంతో నెలకొల్పినట్టు చెప్పారు.
ఇందులో ఫోటో ప్రింట్, ఫ్లెక్స్ ప్రింట్, వినయల్ ప్రింట్, ఫోర్ట్‌ఫోలియా, బ్లూ మాట్, ఎడిటింగ్, డబ్బింగ్, రికార్డింగ్, మిక్సింగ్, టీవీ సీరియల్స్ కోసం అవసరమయ్యే విజువల్ ఎఫెక్ట్స్, డాక్యుమెంటరీ, షార్డ్ ఫిల్మ్స్‌లు కూడా తమ స్టూడియోలో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
చిత్ర పరిశ్రమకు అవసరమైన అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను ఇందులో పొందుపరచాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పేరరసు, వెట్రిమారన్, విజయ్ అంటోనీ, శరవణన్, భాస్కరన్, శంకర నారాయణ, ఉమాపతి, తదితరుల పాల్గొన్నారు.