Sare ne istam Audio released | "సరే నీ ఇష్టం" ఆడియో విడుదల
|
శుక్రవారం రాత్రి రవీంద్రభారతిలో జరిగిన ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్.వి. కృష్ణారెడ్డి ఆడియో కేసెట్‌ను ఆవిష్కరించి, పారిశ్రామిక వేత్త సారిపల్లి కొండలరావుకు అందజేశారు. తర్వాత ఆడియో సీడీని హీరో వరుణ్ సందేశ్ ఆవిష్కరించి, మరో హీరో తనీష్‌కు అందించారు.
ఆడియో విడుదల సందర్భంగా ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ... సినిమా టైటిల్ చాలా గమ్మత్తుగా ఉందన్నారు. అందరికీ ఇష్టమైన టైటిల్ ఇదని, రవీంద్రభారతిలో ఆడియో ఫంక్షన్ జరగడమే చిత్రం సగం సక్సెస్‌కు కారణమని తెలిపారు.
సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ.. ఈ సినిమా పాటలను ఆనవాయితీగా లోకల్ సింగర్స్ పాడారని, అద్భుతమైన ఆడియోగా తీర్చిదిద్దామని, శ్రోతలు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.