1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. చివరి షెడ్యూల్లో "జగన్మోహిని"

Jaganmohini in Last Schedule | చివరి షెడ్యూల్లో "జగన్మోహిని"

వినోదం వెండితెర కథనాలు చివరి షెడ్యూల్ జగన్మోహిని రాజా నమిత మీరాచోప్రా నరసింహరాజు జ్యోతిలక్ష్మి గ్రాఫిక్స్
WD
రాజా, నమిత, మీరాచోప్రా, నరసింహరాజు, జ్యోతిలక్ష్మి ప్రధాన తారాగణంగా మురళీ సినీ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం "జగన్మోహిని".

ఎన్.కె. విశ్వనాథన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి మురళీ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ఫిలింసిటీలో శుక్రవారం నాడు ప్రారంభమైంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీతో షూటింగ్‌ను పూర్తి చేస్తామన్నారు. గ్రాఫిక్స్ పనుల వల్ల కాస్త ఆలస్యమైందని నిర్మాత చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 15వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.

హిస్టారికల్ నేపథ్యంలో రూపొందిన చిత్రమని, పాత జగన్మోహినిలో కొంత పార్ట్ తీసుకుని ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందిస్తున్నామని నిర్మాత తెలిపారు. ఇటీవలే అండమాన్, తలకోన, వైజాగ్‌లలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించామని వెల్లడించారు.

నమిత మాట్లాడుతూ.. తమిళంలో కూడా హీరోయిన్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయని, రెండు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తారని ఆశించారు. ఈ సినిమాలో తాను యువరాజు పాత్రను పోషిస్తున్నానని, తన సినీ కెరీర్‌లో వైవిధ్యమైన పాత్ర ఇదేనని హీరో రాజా చెప్పారు. జానపద చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.

రియాజ్‌ఖాన్, కోటశ్రీనివాసరావు, యువరాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు.. వెన్నెలకంటి, ఆర్ట్.. కృష్ణమూర్తి, సంగీతం.. ఇళయరాజా, మాటలు.. పొంగళ్ మణి.
About Writer
SELVI.M