1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ఏప్రిల్ నెలాఖరున "తేజం" ఆడియో

Thejam Audio release on April month end | ఏప్రిల్ నెలాఖరున "తేజం" ఆడియో

వినోదం వెండితెర కథనాలు ఏప్రిల్ నెలాఖరు తేజం ఆడియో ప్రీతి జింగ్యానియా స్పెషల్ సాంగ్ రాజశేఖర్
WD
నూతన చిత్ర నిర్మాణ సంస్థ సన్‌రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై, రాజ్ కె.ఎస్. గోపి దర్శకత్వంలో, నూతన నిర్మాత ఎస్. రాజశేఖర్ రూపొందిస్తోన్న చిత్రం "తేజం". ఇటీవలే ఈ చిత్రం కోసం ప్రముఖ నటి ప్రీతి జింగ్యానిపై స్పెషల్ సాంగ్ చిత్రీకరించడం జరిగింది.

ఈ చిత్ర విశేషాలను నిర్మాత రాజశేఖర్ చెబుతూ.. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌తో 90 శాతం షూటింగ్ పార్ట్ పూర్తయిందన్నారు. ఇంకా కొన్ని కీలక సన్నివేశాలు, ఒక్క సాంగ్ మాత్రమే మిగిలి ఉందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో 9 మంది హీరోలను, ఒక్క హీరోయిన్‌ను కొత్తగా పరిచయం చేస్తున్నామని వెల్లడించారు. మీడియా పర్సన్‌గా ఈటీవీలోనూ, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ, సురేష్ ప్రొడక్షన్స్‌లోనూ పనిచేసిన అనుభవం ఈ చిత్ర నిర్మాణంలో తనకెంతో దోహదపడిందని రాజశేఖర్ తెలిపారు.

ఇక దర్శకుడి విషయానికొస్తే గత 12 సంవత్సరాలుగా "విక్టరీ" వెంకటేష్ నటించిన పలు చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేయడమే కాకుండా "లైవ్ అండ్ లైట్‌లైవ్" అనే డాక్యుమెంటరీని రూపొందించారని నిర్మాత వివరాలందించారు. ఈ డాక్యుమెంటరీకి సినిమాకు బెస్ట్ డైరక్టర్‌గా 2006 నంది అవార్డు అందుకోవడమే కాకుండా, మెగాస్టార్ చిరంజీవి, యువసామ్రాట్ నాగార్జునల ప్రత్యేక అభినందనలను అందుకున్నారని రాజశేఖర్ తెలియజేశారు.

కథ చెప్పిన దానికన్నా దర్శకుడు అద్భుతంగా సినిమా తెరకెక్కించారని, ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా యూనిట్ అందరి సహకారంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనం కోసం ఎదురుచూస్తున్నారని, తమ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరున "తేజం" ఆడియోను, మే నెల రెండో వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
About Writer
SELVI.M