1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. యదార్థ సంఘటన ఆధారంగా "ఆనందతాండవం"

Real incident based film Ananda Thandavam | యదార్థ సంఘటన ఆధారంగా "ఆనందతాండవం"

వినోదం వెండితెర కథనాలు యదార్థ సంఘటన ఆనందతాండవం తమన్నా సిద్ధార్థ ఆస్కార్ ఫిలింస్
హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా, సిద్ధార్థ (కొత్తనటుడు) హీరోహీరోయిన్లుగా నటించిన "ఆనందతాండవం" చెన్నైలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంది. రచయిత్రి సుజాత రాసిన ధారావాహికను ఆస్కార్ ఫిలింస్ "ఆనందతాండవం" పేరిట చిత్రంగా నిర్మించిందని తెలుగులో ఈ సినిమాను పంపిణీ చేసిన ఎస్.వి.ఆర్. సంస్థ అధినేత్రి శోభారాణి అన్నారు.

ఇదే పతాకంపై వచ్చిన అపరిచితుడు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ తరహాలోనే చక్కని సందేశం ఈ చిత్రంలో ఉందని శోభారాణి తెలిపారు. ఈ నెల పదోతేదీన విడుదలైన "ఆనందతాండవం" అనూహ్య ప్రేక్షకుల ఆదరణను చూరగొందని శోభారాణి పేర్కొన్నారు.

సినిమా విజయవంతమైన సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శోభారాణి మాట్లాడారు. ప్రేమను గురించి పిల్లలకు చెప్పే విధంగానూ, విదేశీ వ్యామోహంతో యువతను పాడుచేయవద్దనే చక్కని సందేశాన్ని పెద్దలకు ఈ చిత్రం ద్వారా చెప్పించారని శోభారాణి తెలిపారు. కథాపరంగా గమనం కాస్త నెమ్మదిగా ఉన్న మాట నిజమేనని, కానీ అది కథకు తప్పదని ఆమె అన్నారు.

గీతరచయిత వనమాలి మాట్లాడుతూ.. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం వినసొంపుగా ఉందని, తాను రెండు పాటలను రాశానని చెప్పారు. ప్రేమతోపాటు జీవిత లక్ష్యాన్ని గెలవాలనే విధంగా యువతకు చక్కని సందేశాన్ని ఈ సినిమాలో చూపారని పేర్కొన్నారు.