1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" ఆడియో రిలీజ్

Oka amaye oka abaye Audio Released | "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" ఆడియో రిలీజ్

వినోదం వెండితెర కథనాలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆడియో రిలీజ్ కృష్ణ విశ్వాస్ రూపాకౌర్ లహరి
WD
ఔటాఫ్ కాలింగ్ ఏరియాలో ఉన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య జరిగే ఆసక్తికరమైన ప్రేమకథతో "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" అనే చిత్రం రూపొందుతోంది. గతంలో "ఖాఖీచొక్కా", "అశోకచక్రం"వంటి చిత్రాలను నిర్మించిన వై.అలెక్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

"తిందామా పడుకుందామా తెల్లారిందా" ఫేమ్ రామ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో విశ్వాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. రూపాకౌర్, లహరి హీరోయిన్లుగా నటించారు.

ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ల్యాబ్ అధినేత రమేష్ ప్రసాద్ ఆడియోను విడుదల చేయగా, వై.ఎస్. రాజశేఖర రెడ్డి సోదరుడు వై.ఎస్. మదన్‌మోహన రెడ్డి సీడీనీ ఆవిష్కరించారు.

వేదికనలంకరించిన అతిథులంతా ఈ చిత్రం పాటలతో పాటు సినిమాకూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రొటీన్‌కు భిన్నంగా కొత్తతరం చక్కని చిత్రాలు తీస్తుందనే తరహాలో ఈ చిత్రముంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సినిమాకు సంగీతం సమకూర్చిన వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ.. తన తొలిచిత్రం "అభిమాని" విడుదలకాక పోయినా తనపై నమ్మకంతో దర్శకుడు రామ్‌కుమార్ సంగీతదర్శకునిగా అవకాశం ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. తన 15 సంవత్సరాల సినీ కెరీర్‌లో మాస్, యాక్షన్ చిత్రాలు తీశానని, తొలిసారిగా క్లాస్‌ను ఆకట్టుకునే ప్రేమకథను తెరకెక్కించామని నిర్మాత వెల్లడించారు.

ఈ చిత్రం సస్పెన్స్‌తో కూడిన ప్రేమ కథ అని చిత్ర దర్శకుడు చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాటలను మనోజ్ఞ, సుధాజీవన్, వరికుప్పల యాదగిరి, గీతామాధురి ఆలపించారు.