1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. మార్కెట్లోకి "నా స్టైలే వేరు" పాటలు

Naa Style veru Audio released | మార్కెట్లోకి "నా స్టైలే వేరు" పాటలు

వినోదం వెండితెర కథనాలు రాజశేఖర్ భూమిక మార్కెట్ నా స్టైలే వేరు పాటలు అడ్వకేట్ శివరామ్
WD
రాజశేఖర్, భూమిక జంటగా నటించిన "నా స్టైలే వేరు" పాటలు సోమవారం నాడు నేరుగా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు జి. రామ్‌ప్రసాద్ తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి, పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని సోమవారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అడ్వకేట్ శివరామ్‌గా రాజశేఖర్ నటించగా, ఆపదలో ఉన్న భూమికను తన శైలిలో ఎలా కాపాడాడు? అన్నదే ఈ చిత్రంలోని ప్రధాన ఇతివృత్తమని దర్శకుడు వివరించారు. ఇందులో రాజశేఖర్ అద్భుతంగా నటించారని, అనూప్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.

అనూప్ మాట్లాడుతూ.. ఇందులో ఐదుపాటలున్నాయని, అన్నీ కథతో మిళితమై, సందర్భానుసారంగా ఉంటాయని చెప్పారు. నిర్మాత మంచి అభిరుచిగల వ్యక్తి అని, చక్కని సాహిత్యం, సంగీతం రాబట్టుకున్నారని వెల్లడించారు.

తాము ఈ చిత్రంలో రెండేసి పాటలు రాశామని గీతరచయితలు భాస్కరపట్ల రవికుమార్, చిర్రావూరి విజయ్‌కుమార్‌లు తెలిపారు. ఈ సినిమాను మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
About Writer
SELVI.M