1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. "బోణి" పాటల విడుదల

Sumanth "Boni" Movie Song realeased | "బోణి" పాటల విడుదల

వినోదం వెండితెర కథనాలు బోణి పాటలు విడుదల సుమంత్ కృతి
WD
గ్రీన్‌మ్యాంగోస్ పతాకంపై రమణగోగుల నిర్మిస్తున్న చిత్రం "బోణి". ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి. సుమంత్, కృతి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ పిప్పళ్ళ దర్శకునిగా పరిచయమవుతున్నారు. సోమవారం రాత్రి నోవోటెల్‌లో జరిగిన ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోటి ఆడియోను ఆవిష్కరించారు.

ఆడియో విడుదల సందర్భంగా కోటి మాట్లాడుతూ.. రమణగోగుల చాలా కష్టపడి ఈ సినిమా తీశారని, కష్టమే మంచి ఫలితం ఇస్తుందని చెప్పారు. గ్రీన్‌మ్యాంగో సంస్థ నిర్మించే ఎల్లో మ్యాంగోలా రుచికరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కోటి వెల్లడించారు.

రమణగోగుల మాట్లాడుతూ.. సినిమాకు కథ ఎంత అవసరమో టెక్నీషియన్స్ కూడా అంతే అవసరమన్నారు. ఈ చిత్రంలోని పాటలను తెలుగువారితోనే పాడించానని, తన సినిమాల్లో ఉదిత్‌నారాయణ వంటి వారినే ఎందుకు పాడిస్తారనే విలేకరుల అడిగే ప్రశ్నకు ఇదే సమాధానమన్నారు.

చక్రి మాట్లాడుతూ... రమణగోగుల నిర్మాత కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆశించారు. ఈ సినిమా పోస్టర్‌లోనే కొత్తదనం కన్పిస్తోందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఈ సినిమా ఉంటుందని లగడపాటి శ్రీధర్ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్ర కథాంశం చాలా కొత్తదనంగా ఉంటుందని తెలిపారు. నిర్మాతతో పాటు చిత్రయూనిట్ అంతా చాలా కష్టపడ్డారని, తప్పకుండా ఈ సినిమా విజయవంతమవుతుందని రాజ్ పిప్పళ్ళ ఆశించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రచయితలు రాజసింహ, రామజోగయ్యశాస్త్రి, జయంత్, అనిత, కథానాయిక కృతి, నిక్కీ గేోగుల తదితరులు హాజరైయ్యారు.
About Writer
SELVI.M