Vidya thrilled working with the Bachchans | వారితో చేస్తున్నానంటే ఇప్పటికీ ఆశ్చర్యమే...!
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లతో మళ్లీ కలిసి నటించడం ఆశ్చర్యంగా ఉందని అందాల ముద్దుగుమ్మ విద్యాబాలన్ చెబుతోంది. చీన్ కుమ్ ఫేమ్ ఆర్. బాల్కీ పా తాజా చిత్రంలో బిజీ బిజీగా ఉంటోన్న విద్యాబాలన్, "గురు" సినిమా తర్వాత అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి నటిస్తోంది.
ఈ సందర్భంగా.. విద్యాబాలన్ మాట్లాడుతూ.. బచ్చన్లలతో మళ్లీ కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, వృత్తిపరంగా చాలా బాగా సహకరిస్తారని చెప్పింది. బాలీవుడ్ ఫాదర్‌గా పిలువబడే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి నటించే అనుభూతే వేరని విద్యాబాలన్ పేర్కొంది.
బాల్కీ తాజా సినిమాలో అభిషేక్ బచ్చన్ తండ్రిగా అమితాబ్ నటిస్తుండగా, తన పాత్ర ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తుందని విద్యాబాలన్ వివరించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని, ఈ షెడ్యూల్లో కొన్ని పాటలతో పాటు, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు ఆమె వివరించింది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ ఏడాది చివరి కల్లా ఈ సినిమాను విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తుందని విద్యాబాలన్ వెల్లడించింది.