Rajadhi Raja very Special flick: Producers | "రాజాధిరాజా"లో అన్ని ప్రత్యేకతలే..!
|
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఎంతోమంది ప్రొడ్యూసర్లు పోటీ పడినప్పటికి అత్యంత ఫ్యాన్సీ ఆఫర్‌తో ఈ సినిమాను తీసుకోవడం జరిగిందన్నారు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రానున్న ఈ సినిమాలో డ్యాన్సర్ లారెన్స్ డ్యాన్స్ అద్భుతమని వారు వెల్లడించారు. ఇందులో నాలుగు డ్యూయెట్స్, ఒక గ్రూప్ సాంగ్‌లున్నాయని, డూయట్స్‌లో కామ్న జఠ్మలానీ, స్నిగ్ధ, మీనాక్షిలు లారెన్స్‌తో పోటీపడి చాలా మంచి అభినయాన్ని ప్రదర్శించారని నిర్మాతలు తెలియజేశారు.
ఇంకా ఈ సినిమాలో మరో అందాల తార ముంతాజ్ లేడీ విలన్‌గా అత్యద్భుతమైన నటనతో ఈ చిత్రానికి వన్నె తెచ్చిందని, కరుణాస్ హాస్యంతో పాటు మంచి సంగీతం అందించారని నిర్మాతలు పేర్కొన్నారు. క్రేజీ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని వారు ఆకాంక్షించారు.
లారెన్స్, కామ్నజెఠ్మలాని, స్నిగ్ధ, మీనాక్షి, ముంతాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పాటలు.. భువనచంద్ర వెన్నెలకంటి, సంగీత దర్శకుడు.. కరుణాస్, ఫైట్స్.. కణ్ణల్ కన్నన్, మాటలు.. శశాంక్.వెన్నెల కంటి.