1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా "మగధీర"

Magadhira comes on May Month | పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా "మగధీర"

వినోదం వెండితెర కథనాలు పునర్జన్మ నేపథ్యం ప్రేమకథ మగధీర రామ్చరణ్ తేజ కాజల్ మెగాస్టార్ చిరంజీవి రాజమౌళి అల్లు అరవింద్
WD
గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం "మగధీర". మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ తేజ, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా, మాస్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మేళవించి వినోదాత్మకంగా చిత్రీకరిస్తున్నారు.

చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. చరణ్‌ను కథానాయకుడిగా మరోమెట్టుపైకి తీసుకెళ్లే చిత్రమిదన్నారు. టైటిల్ చిత్రానికి సరిపోతుందని, సినీ చరిత్రలో కొత్త ట్రెండ్‌కు "మగధీర" శ్రీకారం చుడుతుందని అరవింద్ తెలిపారు. ఈ వేసవిలో చక్కటి వినోదాన్ని పంచేందుకు ఈ సినిమా సిద్ధమవుతోందని, చారిత్రక నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలను రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో చిత్రీకరించామని ఆయన వెల్లడించారు.

ఇందులో "బంగారు కోడిపెట్ట.." అనే రీమిక్స్ గీతంలో చిరంజీవి, చరణ్ కలిసి నటించడం ఈ సినిమా విశేషమని అల్లు అరవింద్ తెలిపారు. ఈ నెలాఖరులో పాటల్ని, మేలో సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సినిమాలో శ్రీహరి ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అరవింద్ వివరించారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా... సెంథిల్, కథ.. వి. విజయేంద్రప్రసాద్, సంగీతం.. ఎం.ఎం. కీరవాణి.