1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. 25 నుంచి నాగార్జున సాగర్‌లో "పాండవులు"

Pandavulu Shooting starts at Nagarjuna Sagar from 25th April Yathi raju Vadivelu Bhanu Ragava | 25 నుంచి నాగార్జున సాగర్‌లో "పాండవులు"

వినోదం వెండితెర కథనాలు 25 నుంచి నాగార్జున సాగర్ పాండవులు యతిరాజు రాఘవ వడివేలు భాను భగవాన్
WD
యతిరాజు, రాఘవ, వడివేలు, భాను, భగవాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "పాండవులు". శంకరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.యస్.నాయుడు దర్శకత్వంలో, ఎన్. లక్ష్మణరావు, వై. శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న "పాండవులు" (వీళ్ళు రన్నింగ్ బాగా చేస్తారు) చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు నాయుడు మాట్లాడుతూ.. రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలని కలలు కనే ఆరుగురు కుర్రాళ్ల కథ ఇదన్నారు. అలీ వేణుమాధవ్, అభినయశ్రీ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డిలు పాల్గొననున్న తదుపరి షెడ్యూల్ ఈ నెల 25 నుంచి నాగార్జున సాగర్‌లో ప్రారంభం కానుందని చెప్పారు.

మే మొదటివారంలో ఆడియోను విడుదల చేసి, జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సమర్పకుడు వెల్లడించారు.