Ali New movie finished 80 percent | 80 శాతం పూర్తయిన అలీ చిత్రం
అలీ హీరోగా, విజయ్‌సారథి దర్శకత్వంలో హనీవేల్ ఆర్ట్స్ అధినేత రవి శ్రీనివాస్ వైట్ల నిర్మిస్తోన్న చిత్రం 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
ఇప్పటివరకు రామోజీ ఫిలింసిటీ, కర్నాటకలోని బళ్ళారి, చిత్రదుర్గం, హైదరాబాద్ కోకాపేట, గండిపేట క్వారీలలో జరిగిన షూటింగ్‌తో క్లైమాక్స్‌ను వారం రోజుల పాటు చిత్రీకరించినట్లు దర్శకుడు చెప్పారు.
మిగిలిన టాకీని, రెండు పాటలను మేలో చిత్రీకరించడం జరుగుతుందని నిర్మాత రవిశ్రీనివాస్ వైట్ల వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
ఇంకా కృష్ణభగవాన్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, రవిప్రకాష్, దువ్వాసి మోహన్, మేల్కొటే, గమ్యం హరి, సీవీఎల్ నరసింహారావు, పావలా శ్యామల, సౌమ్య చౌదరి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి మాటలు... గోపీ వెంకటేష్, పాటలు.. భాస్కర పట్ల, సాహితి, ఎడిటర్.. అనిరుద్ర, ఆర్ట్.. గోవిందు, ఫైట్స్.. థ్రిల్స్ సతీష్, ఫోటోగ్రఫీ.. కె. దత్తు, సంగీతం.. శ్యామ్‌ప్రసన్ (వినాయకుడు ఫేమ్), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. విజయ్ సారథి.