Bollywood actor Feroz Khan Died | బాలీవుడ్ నటుడు ఫిరోజ్ఖాన్ మృతి
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫిరోజ్‌ఖాన్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొన్ని సంవత్సరాలుగా ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఫిరోజ్ ఖాన్, బెంగళూరులోని ఆయన ఫాంహౌస్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధికి ముంబైలో చికిత్స పొందిన అనంతరం పుట్టి పెరిగిన తన ఫాంహౌస్‌లో ఉంటున్నారు.
ఆదివారం క్యాన్సర్ తీవ్రత అధికమవడంతో ఫిరోజ్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం బెంగుళూరులోని ఫిరోజ్ ఖాన్ భౌతిక కాయానికి అంత్రక్రియలు జరుగనున్నాయి.
ఇదిలా ఉంటే.. "ఓన్చే లాగ్" (1965) చిత్రంలో బాలీవుడ్ రంగప్రవేశం చేసిన ఫిరోజ్‌ఖాన్ పలు సొంత సినిమాలు కూడా నిర్మించారు. ఫిరోజ్ నిర్మాణ సారథ్యం వహించిన ఖుర్బానీ, జాన్‌బాజ్, యల్‌గార్ వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్టయ్యాయి. ఇకపోతే.. చివరిగా "వెల్‌కమ్" (2007) చిత్రంలో ఫిరోజ్ నటించారు.