1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ఈనాటి "శ్రీవారి ముచ్చట్లు"

Srivari Muchatlu Cinema Shooting starts | ఈనాటి "శ్రీవారి ముచ్చట్లు"

వినోదం వెండితెర కథనాలు ఈనాటి శ్రీవారి ముచ్చట్లు అక్కినేని నాగేశ్వరరావు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ
సుదీప్ బాబు, శ్రియానాయన్, దివ్యాత్రివేదిలు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతోన్న సినిమాకు, అలనాడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన "శ్రీవారి ముచ్చట్లు" టైటిల్‌ను పెట్టారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుమిత్‌రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మహేందర్ దారీ వార్ సమర్పిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఛాంబర్ అధ్యక్షుడు కె.ఎస్. రామారావు క్లాప్ కొట్టగా, ఎస్.వి. కృష్ణారెడ్డి కెమేరా స్విచ్ఛాన్ చేశారు. రాష్ట్ర ఆర్యవైశ్యసంఘ అధ్యక్షుడు ఇండిశెట్టి కోటేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడితో తొలుత "ఉద్రేకం" అనే సినిమా చేశానన్నారు. శ్రీవారి ముచ్చట్లు సినిమా షూటింగ్ 25 రోజుల పాటు జరుగుతుందని, తర్వాత మే 15 నుంచి ఊటీలో జరిగే షెడ్యూల్తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని వెల్లడించారు.

సినిమా పరిశ్రమ వ్యాపారం బాగోలేకపోయినా, మంచి కథాంశంతో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత చెప్పారు. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ముక్కోణపు ప్రేమ కథాంశంతో రూపొందుతోన్న చిత్ర మిదన్నారు. హీరో పట్నం వచ్చి ప్రేమలో పడతాడు. అదే సమయంలో మరో అమ్మాయి హీరోకు దగ్గరవుతుంది. అయితే ఆమెకు భర్త ఉంటాడు. చివరికి తన తప్పు తెలుసుకుని ఆమె తన భర్త వద్దకు చేరుకుంటుందని దర్శకుడు వివరించారు. ఈనాటి ట్రెండ్‌కు తగిన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని ఆయన చెప్పారు.

ఇందులో మాంత్రికుడి పాత్రను పోషిస్తున్నట్లు రామిరెడ్డి వెల్లడించారు. టెలివిజన్ మహాభారత్ ద్వారా శకుని మామగా తాను ప్రేక్షకులకు పరిచయమని, తెలుగు సినిమాలో మంచి పాత్ర పోషించడం ఆనందంగా ఉందని గోపిమహేందర్ అన్నారు.

ఈ చిత్రంలో శివాజీరాజా, సుమన్, నాగబాబు, జీవా, అన్నపూర్ణ, దువ్వాసిమోహన్, ఆర్.కె. సురేఖా వాణి తదితరులు నటించనున్నారు. ఇంకా ఈ సినిమాకు కెమేరా.. ఆనంద్, సంగీతం.. రాహుల్, ఎడిటర్.. శ్రీనివాస్, ఆర్ట్.. విజయ్, ఫైట్స్.. నందు.
About Writer
SELVI.M