ప్రేక్షకుల ముందుకు వచ్చిన "మిత్రుడు"
|
హైదరాబాద్ పంజాగుట్ట సెంట్రల్‌లోని పీవీఆర్ థియేటర్‌లో సాంకేతిక కారణాల వల్ల బాలకృష్ణ నటించిన "మిత్రుడు" చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో అభిమానులు ఆందోళనకు దింగారు. థియేటర్‌పై రాళ్ల వర్షం కురిపించారు.
థియేటర్ యాజమాన్యం కావాలనే ఉద్దేశపూర్వకంగానే చిత్ర ప్రదర్శనను నిలిపివేసిందని ఆరోపిస్తూ అభిమానులు థియేటర్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. థియేటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులకు నచ్చజెప్పి బయటకు పంపేశారు. అలాగే చిత్తూరు జిల్లాలోనూ అభిమానులు ఆగ్రహం చెందారు.