1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. "రాజాధిరాజా"గా వస్తోన్న లారెన్స్

Lawrence becomes Rajadhi raja | "రాజాధిరాజా"గా వస్తోన్న లారెన్స్

వినోదం వెండితెర కథనాలు రాజాధిరాజా లారెన్స్ కామ్న జెఠ్మలాని స్నిగ్ధ మీనాక్షి
WD
శ్రీదేవీ పిక్చర్స్ పతాకంపై డా.వి.నాగేశ్వర రెడ్డి సమర్పణలో లారెన్స్ హీరోగా నటిస్తోన్న చిత్రం "రాజాధిరాజా". లారెన్స్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. లారెన్స్ సరసన కామ్న జెఠ్మలాని, స్నిగ్ధ, మీనాక్షి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి, ఎన్. రామిరెడ్డి, డా. శరత్ చంద్రారెడ్డి సంయుక్తంగా నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. అన్ని భాషల వారికి నచ్చే కథాంశంతో అత్యంత భారీ చిత్రంగా రూపొందిస్తున్నామన్నారు. అద్భుత నటన, డ్యాన్స్‌తో "రాజాధిరాజా" అనిపించుకునే పాత్ర లారెన్స్‌దని నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రంలో ఫైట్స్, అందాల తార ముంతాజ్ విలనిజం హైలైట్‌గా నిలుస్తుందని వారు చెప్పారు.

కథానాయిక కామ్న జెఠ్మలాని తన అందాలతో అటు టాలీవుడ్‌తో పాటు ఇటు కోలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ చిత్రానికి దర్శకత్వం.. శక్తి చిదంబరం, నిర్మాతలు.. ఎన్.రామిరెడ్డి, డా. శరత్ చంద్రారెడ్డి, సమర్పకుడు.. డా.వి. నాగేశ్వర రెడ్డి, నిర్మాణ సారథ్యం.. హెచ్. శ్రీధర్, పాటలు.. భువనచంద్ర వెన్నెలకంటి, సంగీత దర్శకుడు.. కరుణాస్, ఫైట్స్.. కణ్ణల్ కన్నన్, మాటలు.. శశాంక్ వెన్నెలకంటి.
About Writer
SELVI.M