1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ఏడాదికి మూడు చిత్రాలు: దిల్‌రాజు

'Dil' Raju' plans to make 3 cinemas for 2009 | ఏడాదికి మూడు చిత్రాలు: దిల్‌రాజు

వినోదం వెండితెర కథనాలు ఏడాది మూడు చిత్రాలు దిల్రాజు నాగార్జున రామ్ ఆకాశమంత
తాను ఏడాదికి మూడు చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు. శుక్రవారం తన గత చిత్రాలకు పనిచేసిన దర్శకులను దిల్‌రాజు సన్మానించారు.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. గత ఏడాది మూడు హిట్ చిత్రాలను నెలకొల్పామన్నారు. ఈ ఏడాది నాగార్జునతో ఓ చిత్రాన్ని, కొత్తవారితో మరో చిత్రాన్ని, రామ్ హీరోగా "రామ రామ కృష్ణ కృష్ణ" అనే చిత్రాన్ని నిర్మించనున్నట్లు దిల్ రాజు తెలిపారు.

ఇదిలా ఉండగా.. త్రిష, ప్రకాష్ రాజ్ తండ్రీ కూతుళ్లుగా నటించిన ఆకాశమంత చిత్రం ఇటీవలే థియేటర్లో విడుదలై, అన్ని వర్గాలను ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని దిల్‌రాజు అన్నారు. ఇదే తరహాలో ఈ ఏడాది నిర్మించనున్న ఈ సినిమాలు కూడా హిట్ కావాలని ఆయన ఆశించారు.
About Writer
SELVI.M