"GVK one" Mall Starts at Hyderabad | "జీవీకే వన్" మాల్ ప్రారంభం
|
ఇందులో ఫన్‌డోన్ భాగాన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం అండ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ స్వర్ణజిత్ సింగ్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోనే అధునాతనమైన సాంకేతిక విలువలతో ఎంటర్‌టైన్‌మెంట్ భాగాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా స్వర్ణజిత్ సింగ్ మాట్లాడుతూ.. ధనవంతులు, విద్యానిపుణులు వినోదభరితంగా గడపడానికి ఇది వేదికకానుందని చెప్పారు.
సంస్థ డైరక్టర్‌లో ఒకరైన అబ్రహం మాట్లాడుతూ.. యూరప్, యు.ఎస్.ఎలో పొందే అనుభవాన్ని మనం ఇక్కడే పొందవచ్చునన్నారు. పాఠశాల విద్యార్థులకు ఆటపాటలతో సరదాగా గడిపేందుకు ఫన్‌జోన్ చాలా ఉపయోగపడుతుందన్నారు.
జాతీయ స్థాయిలో నెం.1గా నిలవాలనే జీవీకే అనే పేరు పెట్టామని జీవీకే వన్ మేనేజింగ్ డైరక్టర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ బ్రాండ్ల వస్తువులు లభించే విధంగా షోరూమ్‌లను కూడా ఇందులో నెలకొల్పామని ఆయన చెప్పారు. షాపర్‌స్టాప్, లాక్టోస్ వంటి బ్రాండ్ షోరూమ్‌లు ఇక్కడ ఉన్నాయని, ఈ మాల్ ఏర్పాటుకు 350 కోట్ల వ్యయమైందని వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.
పూర్తి స్థాయి వ్యాపార వినోద కేంద్రంగా హైదరాబాద్‌కు ప్రత్యేకత తెచ్చిపెడుతుందని సంస్థ మేనేజింగ్ డైరక్టర్ కృష్ణ భూపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో 1250 సీట్లతో ఆరు తెరలు ఉండే సిక్స్ మల్టీఫ్లెక్స్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.