Aarthi Agarwal New cinema comes location on June | ఆర్తీ అగర్వాల్ కథానాయికగా కొత్త చిత్రం!
|
ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ బాబు మాట్లాడుతూ.. తెలుగులో మళ్ళీ రీ-ఎంట్రీ అవుతున్న ఆర్తీ అగర్వాల్ నటించే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రమిదన్నారు. ఇందులో నటించడం కోసం ఆర్తీ అగర్వాల్ చాల్ స్లిమ్‌గా తయారయ్యారని నిర్మాత తెలిపారు.
ఈ సినిమా షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించి చెన్నై, హైదరాబాద్‌లలో జరిగే సింగిల్ షెడ్యూల్‌తో చిత్రాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇంకా ఈ సినిమాలో ఐదు ఫైట్లు ఉంటాయని నిర్మాత వివరించారు.
కథానాయిక ఆర్తీ అగర్వాల్ మాట్లాడుతూ.. నాలుగైదు అవకాశాలు వచ్చినప్పటికీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించానని చెప్పారు. తన గత చిత్రాలకు భిన్నంగా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా ఉంటుందని ఆర్తీ వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. టి. మోహన్‌రెడ్డి (యుఎస్ఎ), నిర్మాత.. సి.హెచ్. సుధాకర్ బాబు, కథ, ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. వి.వి. ప్రసాద్.