Additional Song add for Mitrulu Movie | మరో పాటతో మళ్లీ తెరపైకి "మిత్రుడు"
చిత్రం విడుదలైన తర్వాత పాటలను జతచేసే ఆచారాన్ని టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ అనాదిగా పాటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలకృష్ణ, ప్రియమణి నటించిన "మిత్రుడు" చిత్రంలో ప్రత్యేకంగా ఓ పాటను హీరోహీరోయిన్లపై చిత్రించి త్వరలో జతచేయనున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
మంగళవారం మహతీ రికార్డింగ్ థియేటర్‌లో నిర్మాత ఈ విషయాన్ని తెలియజేశారు. 22 ప్రింట్లతో ఈ చిత్రాన్ని ఇటీవలే విడుదల చేశామని శివలెంక వివరించారు. అదనంగా మరో 14 ప్రింట్లను పెంచబోతున్నామని, అప్పుడే ఈ పాటను కూడా జత చేస్తామని ఆయన చెప్పారు.
ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్ చిత్రాలు బాలకృష్ణ చేస్తున్న సమయంలోనే తాను "ఆదిత్య 369" అనే చిత్రాన్ని నిర్మించానని, అది అప్పట్లోనే వందరోజులు ఆడిందని నిర్మాత గుర్తు చేశారు. ప్రస్తుతం మిత్రుడు కూడా మంచి ఆదరణ పొందుతుందని ఆశించారు. బాలకృష్ణ, ప్రియమణిపై చిత్రించే ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులు సమకూర్చనున్నట్లు శివలెంక ప్రసాద్ అన్నారు.