Act with nudity is an art...? | నగ్నంగా నటించడం ఓ "ఆర్ట్"అట
అలనాడు నిండైన వస్త్రాలు ధరించి నటనను పండించి ప్రేక్షకుల మెప్పును పొందారు నాటి తారామణులు. అయితే క్రమేణా అది కనుమరుగై పోతోంది. పొదుపుగా దుస్తులు ధరించి నటిస్తూ అంగాంగాలను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే భంగిమలతో ప్రేక్షకులను వలలో వేసుకోవచ్చన్న విశ్వాసం పెరిగిపోతోంది. దీంతో క్రమంగా నిండైన వస్త్రధారణ స్థానే బికినీ స్టయిల్ వచ్చేసింది.
ఈ సందర్భంగా ఓ హాలీవుడ్ నటీమణి చెప్పిన మాటను ఇక్కడ ఉదహరించక తప్పదు. ఆమె ఏమన్నదంటే, "మన0 పుట్టుకతోనే నగ్నంగా పుడతాం. ఇది నిజంగా ఓ కళ. శరీరంలో దాగి ఉన్న ఈ కళను ఉన్నది ఉన్నట్లుగా చూపించడానికే దేవుడు మనిషిని ఇలా రూపొందించాడు" అని స్విమ్ సూట్‌లో తన అంగాంగాలను ప్రదర్శించే సూపర్ మోడల్ జోన్నా కృప సెలవిచ్చింది.
అలా అర్థ నగ్నంగా నటించడమనేది హాలీవుడ్‌లో ప్రారంభమై బాలీవుడ్‌కు తరలి వచ్చింది. క్రమంగా ఇతర సినీ పరిశ్రమలకు పాకింది. మల్లికా శరావత్, షెర్లిన్ చోప్రా, మినిషా లాంబా వంటి ఎందరో బాలీవుడ్ తారామణులు దుస్తులను ఎంత తక్కువగా ధరించి నటించమని అడిగినా నటించేందుకు సిద్ధంగా ఉన్నారు.
నగ్న దృశ్యాలను కత్తిరించినందుకు ఈమెకు బాధగా ఉందట
షెర్లిన్ చోప్రా ఆ మధ్య తాను నిర్వహించిన ఓ ఆల్బమ్ నుంచి పూర్తి నగ్నంగా ఉన్న దృశ్యాలను తొలగించినందుకు సెన్సార్ సభ్యులపై రుసరుస లాడింది. ఆ సన్నివేశాలు ప్రేక్షకుల మదిని మరో లోకంలోనికి తీసుకువెళ్లగలవనీ, వాటిని కత్తిరించినందుకు చాలా బాధగా ఉందని ప్రకటించింది. అంటే నగ్నంగా నటించడమే కాదు అలా నటించినవాటిని ప్రేక్షకులు చూసి ఆస్వాదించాలని ఇటువంటి తారామణులు కోరుకుంటున్నట్లు అర్థమవుతుంది.
పాశ్చాత్య తారలకు సంబంధించిన సినిమాలను ఎప్పుడైతే భారతదేశంలోనికి అనుమతించారో అప్పుడే నగ్నానికి తలుపులు తెరిచినట్లయిందని ఓ సినీ విశ్లేషకులు అంటున్నారు. సన్నివేశం డిమాండ్ రీత్యా అలా నటించక తప్పలేదని కొందరు తారామణులు చెప్పడంపై మాట్లాడుతూ సదరు విశ్లేషకుడు, బెడ్రూంలో శృంగారం ఎలా జరుగుతుందో అలానే నటించి, ఆపై సన్నివేశం అనుగుణంగా అలా నటించాల్సి వచ్చిందని చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నాడు. మారుతున్న పరిస్థితుల బట్టి చూస్తే అతను చెప్పేది జరిగినా ఆశ్చర్యపోనక్కరేదు.
మన సినిమాలలో నగ్నత్వాన్ని ప్రక్కనపెడితే హాలీవుడ్ సినీ పరిశ్రమ ఈ పరిధులను ఎప్పుడో దాటి వెళ్లిపోయింది. ఆ ప్రభావం జనజీవనంపై పడిన ఫలితంగా అక్కడ విలువలు, సంబంధాలు పతనావస్థకు చేరుకున్నాయి. భార్యాభర్తల బంధం సైతం అంతా సినీమాటిక్‌గానే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
బికినీలో నటిస్తే అవకాశాల వరద
ఇక మన తెలుగు పరిశ్రమ విషయానికి వస్తే, ఆదిలో మన తెలుగు సినిమాల్లో క్లబ్ డ్యాన్సులకంటూ కొందరు తారలు ఉండేవారు. వారు కూడా మితిమీరిన ఎక్స్‌పోజింగ్ చేస్తూ నటించిన సందర్భాలు చాలా తక్కువ. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కథానాయికలే క్లబ్ డ్యాన్సర్ల అవతారం ఎత్తుతున్నారు. చెప్పాలంటే వారిని మించి పోయారు.
ఒక తార తాజాగా బికినీలో కనిపించి అవకాశాలను పోగు చేసుకుందని విన్నవెంటనే మరోతార అంతకు రెట్టించిన ఉత్సాహంతో బికినీ సన్నివేశాలకు సై అంటోంది. ఇదే అదనుగా నిర్మాతలు సైతం డబ్బే ప్రధాన లక్ష్యంగా ప్రముఖ తారలను బికినీలో నటింపజేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
వీటన్నిటికీ మించి తారామణుల మధ్య విపరీతమైన పోటీ నెలకొనడం బికినీ సన్నివేశాలకు దారితీస్తున్నట్లు కొందరు సినీ ప్రముఖులు అంటున్నారు. ఫలానా సినిమాలో ఫలానా తార అర్థనగ్న దృశ్యాల్లో నటించడం వల్లనే ఆమెకు మంచి క్రేజ్ వచ్చిందనీ, అందువల్ల మీరూ అదే దారిలో పయనించక తప్పదని చెప్పేవారి సంఖ్య అధికమైనట్లు సమాచారం. పోటీని తట్టుకుని అవకాశాలను చేజిక్కించుకునేందుకు తారామణులకు బికినీ పాట్లు తప్పడం లేదు.
ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, కొందరు తారలు అసలు ఎక్స్‌పోజింగ్ చేయకుండా సినిమాల్లో నటించమని తెగేసి చెప్పడం. మన తెలుగు సినిమాల్లో అర్థనగ్నం అలా వర్థిల్లుతోంది మరి. చివరికి ఈ అర్థనగ్నం హాలీవుడ్ రేంజ్ లో పూర్తి నగ్నం కాకుండా చూడాల్సిన భాద్యత సినీ పరిశ్రమలపైనే ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.

|