1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్!

"Ramdev" in dubbing works | డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్!

వినోదం వెండితెర కథనాలు డబ్బింగ్ కార్యక్రమాలు రామ్దేవ్ అబ్బాస్ గ్రేసీ సింగ్ ఆకాశ్ అర్చన్ సాయికిరణ్
WD
అబ్బాస్, గ్రేసీసింగ్, ఆకాశ్, అర్చన, సాయికిరణ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం "రామ్‌దేవ్". రామ్‌దేవ్‌లుగా అబ్బాస్, ఆకాష్‌లు నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.కె. బషీద్ నిర్మాత దర్శకత్వం వహించడం విశేషం.

గతంలో రాజశేఖర్‌తో ఎవడైతే నాకేంటి? చిత్రానికి ఫైనాన్స్ చేసిన బషీద్‌పై పలు ఛీటింగ్‌కేసులు జూబ్లీహిల్స్‌లో నమోదయ్యాయి. లాండ్ మాఫియాగా కూడా మరో కేసు బుక్ అయింది. ఇటీవలే ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు కూడా.

ఈ నేపథ్యంలో తమ చిత్రానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా షూటింగ్‌ను అనుకున్న విధంగా పూర్తి చేస్తామని నిర్మాత ఎస్.కె. కరీమున్నీసా అంటున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా, ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉందని చెప్పారు.

త్వరలో తొలికాపీ సిద్ధమవుతుందని, ముక్కోణపు ప్రేమకథతో బషీద్ చక్కగా తెరకెక్కించారని కరీమున్నీసా కితాబిచ్చారు. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదిరిస్తారో వేచి చూడాల్సిందే.!
About Writer
SELVI.M