1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి కొత్త చిత్రం ప్రారంభం

Friends film academy new movie launched | ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి కొత్త చిత్రం ప్రారంభం

వినోదం
WD
"కుర్‌కురే" ఫేమ్ ఇంద్ర హీరోగా, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రావణ్ బాపట్ల దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి బొద్దం ఇంద్రసేన నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

బిందు, శ్రీ అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తొలిషాట్‌కు పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టగా, హీరో బాబాయ్ గాదే రాజశేఖర్ స్విచ్ఛాన్ చేశారు.

ఈ చిత్రం గురించి హీరో ఇంద్ర మాట్లాడుతూ.. కుర్‌కురే తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రమిదన్నారు. ఆర్టిస్టుగా 20 సినిమాల్లో నటించానని, దర్శకుడు తనపై నమ్మకంతో ఈ చిత్ర కథ వినిపించారని చెప్పారు. అది విన్నాక నిర్మాత కూడా తానంటే ఈ పాత్రకు న్యాయం చేయగలనని చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు ఇంద్ర అన్నారు.

నటి కవిత మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో రూపొందిన ఈ సినిమాలో అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండేలా స్క్రీన్‌ప్లే తయారు చేశారని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ.. బంగారం తయారు చేసే విధానంతో కలిగిన ఇబ్బందులను సస్పెన్స్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపించామని తెలిపారు. ఈ నెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమౌతుందన్నారు.

ఈ చిత్రంలో జీవా, ఎం.ఎస్. నారాయణ, సూర్య, రాజేందర్, కొండవలస, ఉత్తేజ్, పృథ్వి, దువ్వాసి మోహన్, జెన్ని, దేవీశ్రీ, జయవాణి తదితరులు నటిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. షమ్ము వి. ప్రభాకర్, సంగీతం.. వై. సత్య, ఆర్ట్.. విజయకృష్ణ, సమర్పణ.. పాన్ అమెరికా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. శ్రావణ్ బాపట్ల.
About Writer
SELVI.M