1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. మళ్లీ తెరపైకి బ్రహ్మానందం తనయుడు!

Brahmanandam's Son Jumping Once Again | మళ్లీ తెరపైకి బ్రహ్మానందం తనయుడు!

వినోదం
WD
"హాస్యబ్రహ్మ" బ్రహ్మానందం కుమారుడు మళ్లీ తెరపైకి రానున్నారు. గౌతమ్ హీరోగా గతంలో "పల్లకిలో పెండ్లికూతురు" చిత్రం విడుదలైంది. కె. రాఘవేంద్రరావు ఆశీస్సులతో సుచిత్ర చంద్రబోస్ ఈ చిత్రానికి దర్శకురాలిగా పరిచయమైంది. ఆ తర్వాత ఈ చిత్రం పాటలపరంగా మంచి ఆదరణ పొందినా సక్సెస్ సాధించలేకపోయింది.

అదే సమయంలో ఎం.ఎస్. నారాయణ కుమారుడు విక్రమ్ హీరోగా విక్రమ్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఇద్దరి చిత్రాలు ప్రజాదరణ పొందలేదు.

ఆ తర్వాత తన కుమారుడు గౌతమ్ ఇప్పట్లో హీరోగా నటించే ఆలోచనలో లేదని బ్రహ్మానందం చెప్పారు. ఈలోగా గౌతమ్ నటన, డాన్స్‌లలో సరైన తర్ఫీదు తీసుకుని మళ్లీ తెరపైకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

తాజాగా "ప్రయాణం" దర్శక నిర్మాత చంద్రశేఖర్ ఏలేటి నేతృత్వంలో రూపొందే తదుపరి చిత్రంలో గౌతమ్ హీరోగా నటిస్తున్నాడని దర్శకుడు స్పష్టం చేశారు.

మరోవైపు ఆగస్టులో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది.
About Writer
SELVI.M