1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. మూడో షెడ్యూల్లో "అబ్బో... వాడా..!"

Abho.. Vada in 3rd Schedule | మూడో షెడ్యూల్లో "అబ్బో... వాడా..!"

వినోదం
WD
బ్రహ్మాజీ, రేఖాశ్రీ హీరోహీరోయిన్లుగా, శ్రీ కుమారస్వామి ఫిలిమ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న కొత్త సినిమాకు "అబ్బో.. వాడా" అనే పేరును ఖరారు చేశారు. రత్నం కె.వి.దర్శకత్వంలో ఎస్. బసవపున్నయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం, ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మూడో షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు నిర్మాత అన్నారు.

దర్శకుడు కథను చెప్పినట్లే వైవిధ్యభరితంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని బసవపున్నయ్య తెలిపారు. తొలి షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు నిర్మాత చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ఒక సున్నితమైన పాయింట్‌ను తీసుకుని బ్రహ్మాజీ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలియజేశారు. రంగనాథ్, రమాప్రభ, రాఘవ, హేమసుందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం.. బల్లేపల్లి మోహన్, ఛాయాగ్రహణం.. కుమారస్వామి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. రత్నం కె.వి.
About Writer
SELVI.M