అంతర్జాతీయ వేదికపై ముచ్చటగా మూడోసారి..!
బాలీవుడ్ సినీజగత్తులో ఎప్పటికప్పుడు హాట్-హాట్ ఎఫైర్స్ నడుపుతూ, ఏదో ఒకరకంగా తన పేరు మీడియాలో నలిగేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ..బాలీవుడ్ ప్రపంచంలో తన హవా నడిపిస్తున్న కరీనా కపూర్ ముచ్చటగా మూడోసారి అంతర్జాతీయ వేదికపై తనదైన నృత్యంతో ఆహుతులను అలరించనున్నది.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ గత పది సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇస్తున్న పురస్కారాల వేడుక సందర్భంగా ఈ సంవత్సరం కూడా కరీనా కపూర్ నృత్యం ఉండేలా ప్రణాళికను రూపొందించింది.
ఈ పురస్కారాల వేడుకలో నృత్యం చేసేందుకుగాను భారీ పారితోషికం తీసుకుంటున్న కరీనా తను చేసే నృత్యం రొటీన్‌కు భిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈసారి బెల్లీ డాన్స్ చేసేందుకు రిహార్సిల్స్ చేస్తోంది.
గత కొద్ది నెలలుగా బెల్లీ డాన్స్‌కు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్న కరీనా ఈ వేదికపై తొలిసారిగా ఆ నృత్యం ప్రదర్శించి ఆహుతుల మనసులు కొల్లగొట్టాలని యోచిస్తోన్నట్లు సమాచారం. ఈ వేడుకలకు కరీనా ప్రియుడు సైఫ్ అలీఖాన్ కూడా హాజరవుతుండటం గమనార్హం.
ఈ నృత్య ప్రదర్శన సందర్భంగా కరీనా అరేబియన్ రాకుమారిలా దర్శనమివ్వనుంది. సుప్రసిద్ధ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ నృత్య ప్రదర్శనకు కరీనాకు అవసరమైన దుస్తులు సమకూర్చుతున్నట్లు బాలీవుడ్ సమాచారం.