1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ప్రేమకథా నేపథ్యంలో అరుణై పిక్చర్స్ కొత్త చిత్రం

Arunai Pictures Production No.1 | ప్రేమకథా నేపథ్యంలో అరుణై పిక్చర్స్ కొత్త చిత్రం

వినోదం
WD
కాలేజీలో చదివే 18-21 వయస్సు గల యువతీ యువకుల మధ్య సాగే ప్రేమ కథా నేపథ్యంలో అరుణై పిక్చర్స్ ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి బి.ఆర్. వర్మ దర్శకుడు. ఇ.వి. కుమరన్ నిర్మాత. ఈ సినిమాలో అవితేజ్, తిరు, వైనవి, పార్వతి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తయిందని, కమల్ హాసన్ నటించిన ఓ సినిమా గీతంలోని పల్లవిని తీసుకుని "ఇళమై ఇదో ఇదో" (తెలుగులో యవ్వనం ఇదిగో ఇదిగో) అనే పేరు పెట్టామని దర్శకుడు వెల్లడించారు. తెలుగులో టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని వర్మ వివరించారు. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయని, దర్శకులు శ్యామ్, జయ దగ్గర పనిచేసిన అనుభవంతో ఈ చిత్రానకి దర్శకునిగా పరిచయమవుతున్నానని చెప్పారు.

హాస్యనటుడు సునీల్ మాట్లాడుతూ.. తమిళంలో వివేక్ చేసిన పాత్రను తెలుగులో తాను పోషిస్తున్నానన్నారు. ఇందులో తన పాత్ర పేరు మన్మథరాజా అని, కానీ ప్రేమికులంటే అసహ్యించుకుంటానని చెప్పారు. తన పాత్రను దర్శకుడు చాలా సరదాగా మలిచారని సునీల్ వెల్లడించారు.

ఆద్యంతం సరదాగా సాగుతుందని చిత్ర హీరోలుగా పరిచయమవుతున్న అవితేజ్, తిరు తెలిపారు. తాను నటించిన తొలి తమిళ చిత్రం విడుదలకు సిద్ధమైందని, ఇది తనకు రెండో చిత్రమని నటి వైనవి అన్నారు. ఈ సినిమా తనకు మంచి గుర్తింపు సంపాదించి పెడుతుందని మరో నటి పార్వతి ఆశించారు.

ఇకపోతే జూలై పదోతేదీన విడుదల కానున్న ఈ సినిమాలో బెనర్జీ, మూర్తి, సూరి, సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి మాటలు.. స్వర్ణ సుధాకర్, పాటలు.. భువన చంద్ర, సంగీతం.. విద్యాసాగర్, ఎడిటింగ్.. వి.టి. విజయన్, కెమేరా.. ఆకాష్ అశోక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. ఇ.వి.వి. కంభన్.
About Writer
SELVI.M