still i've hopes in bollywood: reka | సినిమాలనుంచి నేనింకా రిటైర్ కాలేదు: రేఖ
వయసుమీద పడ్డా తరగని అందంతో కుర్రకారుని సైతం మత్తెక్కించగలిగిన బాలీవుడ్ నటి రేఖ నటననుంచి తాను ఇప్పట్లో తప్పుకోబోనని తేల్చి చెప్పింది. సినిమాల్లో నటించాలనే తపన తనలో ఇంకా అడుగంటలేదని, సినీ జీవితంలో తాను సాధించాల్సింది ఇంకా మిగిలే ఉందని ఈ సందర్భంగా రేఖ పేర్కొంది.
బాలీవుడ్‌లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన రేఖ కృషికి గుర్తింపుగా ఆమెకు రాజ్ కపూర్ జీవన్ గౌరవ్ పేరుతో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తనకు తెలియజేసిన సమయంలో రేఖ పై విధంగా స్పందించింది. లైఫ్ టైం అచీవ్‌మెంట్‌లాంటి అవార్డును స్వీకరించడం ద్వారా తన సినీ కెరీర్ ముగిసిపోయిందనే సంకేతాలను తాను ఇవ్వలేనని, నటించాలనే తపన తనలో ఎంతమాత్రం తగ్గిపోలేదని ప్రభుత్వానికి రాసిన లేఖలో రేఖ పేర్కొంది. ఈ కారణంగానే ప్రభుత్వం ఇస్తానంటున్న అవార్డు తనకు వద్దని రేఖ ఖచ్చితంగా చెప్పేసింది.
అయితే రేఖకు అవార్డు ఇవ్వాలనే తమ నిర్ణయాన్ని మార్చుకోని మహారాష్ట్ర ప్రభుత్వం చివరకు అవార్డు పేరును మార్చేందుకు నిర్ణయించింది. ఈ విషయమై అవార్డు నిర్వాహక కమిటీ మాట్లాడుతూ రేఖ సెంటిమెంటును గౌరవిస్తూ అవార్డు పేరును రాజ్‌కపూర్ ప్రతిభా గౌరవ్‌గా మార్చడం ద్వారా ఆమెకు ఈ పురస్కారాన్ని అందిస్తామని తెలిపారు.
ఐదు పదుల వయసు దాటిన రేఖను చూసినవారెవరైనా ఆమెకు అంత వయసుందంటే అస్సలు నమ్మరు. 55ఏళ్ల వయసులోనూ యువ తారలకు పోటీపడే అందంతో విరజిల్లుతున్న రేఖ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు ఎందుకు వద్దందో ఆమెను చూచిన ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది.