Vijayendra reddy Says No Unity Among Telugu Producers | నిర్మాతల్లో ఐక్యత లేదు: విజయేంద్ర రెడ్డి
నిర్మాతల్లో ఐక్యతలేక పోవడం వల్లే చిన్న నిర్మాతలకు థియేటర్ల సమస్య తలెత్తిందని హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (నైజాం సర్క్యూట్) అధ్యక్షుడు ఎం. విజయేంద్ర రెడ్డి ధ్వజమెత్తారు.
తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగానూ బాధ్యతలు స్వీకరిస్తున్న విజయేంద్ర రెడ్డి మంగళవారం సికింద్రాబాద్‌లోని ఛాంబర్ కార్యాలయంలో ఈ విషయమై మాట్లాడుతూ.. నిర్మాతల కార్యవర్గ సమావేశంలో చిన్న, పెద్ద నిర్మాతలని కాకుండా అందరూ ఒకే త్రాటిపై నిలిచి, థియేటర్లలో పర్సెంటేజీ సిస్టమ్స్‌ను అమలు చేయడానికి సిద్ధమని ప్రకటిస్తారు. కానీ బయటకు రాగానే ఎవరికివారే చందంగా ఉంటారని విజయేంద్ర రెడ్డి ఎత్తిచూపారు.
అయితే ఈ పద్ధతి సరికాదని, నిర్మాతలందరూ ఈ అంశంపై సమిష్టిగా చర్చించాలని విజయేంద్ర రెడ్డి పిలుపు నిచ్చారు. థియేటర్ ఫ్రీక్వెన్సీని బట్టి పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలని ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశామని, కానీ ఇంతవరకు సరైన సమాధానం రాలేదని ఆయన వెల్లడించారు.
మా ఆధ్వర్యంలోని 2500 థియేటర్లలో ఉన్న పర్సెంటేజీ విధానాన్ని చిన్న నిర్మాతలు సద్వినియోగం చేసుకోకుండా, గుత్తాధిపత్యం ఉన్న థియేటర్లను నమ్మి మోసపోవడం జరుగుతుందని విజయేంద్ర రెడ్డి వివరించారు.
డిమాండ్ అండ్ సప్లయ్ లాంటి ఈ వ్యాపారంలో ఎవరు థియేటర్‌కు రెంట్ ఎక్కువిస్తే వారికి అద్దెకిస్తున్నారని విజయేంద్ర రెడ్డి వాపోయారు. ప్రభుత్వంకూడా ఈ విషయంలో ఏమీ చేయలేదని, అవసరమైతే ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటామన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలోనే లేనిపోని ఇగోలు
కర్నాటక ఫిలిం ఛాంబర్‌లో ఇలాంటి సమస్యలకు తావుండదని విజయేంద్ర రెడ్డి అన్నారు. ఛాంబర్ గీచిన గీటును ఏ నిర్మాత, హీరోగానీ దాటే ప్రసక్తే లేదని ఆయన ఎత్తి చూపారు. కానీ తెలుగు పరిశ్రమలో మాత్రమే లేనిపోని ఇగోలతో చిన్న నిర్మాతలను ఇబ్బందిపెడుతుంటారని విజయేంద్ర రెడ్డి పేర్కొన్నారు.
కర్నాటకలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా మినిమం ప్రింట్లతోనే విడుదలవుతుందని, అదే ఇక్కడైతే పోటీపడి 400 ప్రింట్లను విడుదల చేసి థియేటర్ల కబ్జాకు సహకరిస్తారని ఆయన తెలియజేశారు. ఇప్పటికైనా కర్నాటక సినీ ఇండస్ట్రీని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని విజయేంద్ర రెడ్డి హితవు పలికారు.