'Ride' Trailers released | "రైడ్" సినిమా ట్రైలర్స్ విడుదల
|
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ ఐదో తేదీన రైడ్ సినిమాను విడుదల చేస్తామని బెల్లంకొండ తెలిపారు. యూత్ యాక్షన్ సెంటిమెంట్‌తో ఈ చిత్రం రూపొందిందని, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముందని నిర్మాత ఆశించారు. దర్శకుడు రమేష్ వర్మ ఇకనుంచి రైడ్ వర్మగా పిలువబడతారని బెల్లంకొండ నమ్మకం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. నందమూరి తారకరామారావు 87వ జన్మదినం సందర్భంగా బెల్లంకొండ నందమూరి అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు.