Anjaneyulu latest schedule starts at Hyderabad | హైదరాబాద్‌లో "ఆంజనేయులు"
|
ఈ సినిమా గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ.. ఆమ్‌స్టర్ డామ్, జర్మనీ, ఆస్ట్రియాలలోని విభిన్న లొకేషన్లలో రవితేజ, నయనతారలపై రెండు పాటల్ని చిత్రీకరించామన్నారు.
ఈ పాటలే సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాత తెలిపారు. 30వ తేదీ నుంచి హైదరాబాదులో ప్రారంభం కానున్న తాజా షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని ఆయన చెప్పారు.
దర్శకుడు పరుశురామ్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలిచారని కొనియాడారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమాను ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత వివరించారు.
ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. కె. రవీంద్రబాబు, సంగీతం.. ఎస్.థామస్, ఆర్ట్.. చిన్నా, సమర్పణ.. రవికిరణ్ బాబు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం.. పరుశురామ్.