1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. నాగ్ చేతుల మీదుగా "కరెంట్" టైటిల్ సాంగ్ విడుదల

Nagarjuna released Curennt Title song | నాగ్ చేతుల మీదుగా "కరెంట్" టైటిల్ సాంగ్ విడుదల

వినోదం
WD
"కాళిదాసు" ఫేమ్ సుశాంత్ హీరోగా నటిస్తోన్న "కరెంట్" చిత్రం టైటిల్ సాంగ్‌ను అక్కినేని నాగార్జున శుక్రవారం విడుదల చేశారు. సుశాంత్ నటించిన ఈ సినిమాలోని నాలుగు పాటలను రొటీన్‌కు భిన్నంగా విడుదల చేయించారు.

దర్శకులు శేఖర్ కమ్ముల, సుకుమార్, పూరీ జగన్నాథ్, శ్రీనువైట్ల ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిచేత ఒక్కో పాటను చిత్ర నిర్మాతలు (చింతలపూడి శ్రీనివాస్, నాగ సుశీల) విడుదల చేయించారు. ఈ సినిమాలోని ఐదో పాటను శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. కరెంట్ చిత్రకథ తనకు తెలియదని, కానీ చిత్ర యూనిట్ కథ గురించి, నటీనటుల పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పినప్పుడు బాగా ఆడుతుందనే నమ్మకం కలిగిందన్నారు.

నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్యలో సాగే కెమిస్ట్రీ కరెంట్ అన్నారు. అందుకే టైటిల్‌ను ఆ విధంగా పెట్టామని, జూన్ 19న సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో దేవీశ్రీ ప్రసాద్, సుశాంత్, స్నేహా ఉల్లాల్, గీత రచయితలు పాల్గొన్నారు.
About Writer
SELVI.M