1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Dil raju

Animation| Dil raju| Visual| pix lauid| Graphics | యానిమేషన్ రంగంలో దిల్‌రాజు

యానిమేషన్
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు యానిమేషన్ రంగంలోకి అడుగుపెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో అయిన "పిక్స్‌లాయిడ్"కు దిల్‌రాజు పార్టనర్‌గా ఉన్నారు. ఈ స్టూడియోలో గ్రాఫిక్స్ చేసిన "సైనికుడు" చిత్రానికి 2006లో నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే దిల్‌రాజు చిత్రాలన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఈ స్టూడియోలోనే జరిగాయి.

ఈ విషయమై దిల్‌రాజు మాట్లాడుతూ.. ఈ స్టూడియో బ్రాంచీలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నెలకొల్పి, అక్కడ టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తామని అన్నారు. వీరితో యానిమేషన్‌‍‌రంగంలో పలు చిత్రాలను తీయాలనే ఆలోచనలో ఉన్నామని దిల్‌రాజు తెలియజేశారు. ఈ స్టూడియోను ప్రభాస్, నాగార్జున, శ్యాం ప్రసాద్ రెడ్డి, నితిన్ తదితరులు సందర్శించారు.
About Writer
SELVI.M