Mega Star Chiranjeevi| jagapathy Babu| Hero| Adhinetha | "మా నాన్న చిరంజీవి.."గా వస్తోన్న జగపతిబాబు
|
ఈ చిత్రం గురించి అరుణ్‌ప్రసాద్ చెబుతూ.. ఇదేదో మెగాస్టార్ చిరంజీవి గురించి అనుకుంటే పొరపాటే. కథలో హీరో పేరు చిరంజీవులు. అయితే చిరంజీవి అని పిలుస్తుంటారు. ఓ పిల్లాడికి, చిరంజీవులుకు మధ్య జరిగే కథే ఈ చిత్రం. ప్రతి తండ్రీ మా నాన్న హీరోలా ఉండాలనుకుంటాడు. అదే సినిమా కథని అరుణ్ ప్రసాద్ తెలిపారు.
ఇందులో పిల్లాడి పాత్రను "తులసి"లో నటించిన మాస్టర్ అతులిత్ పోషించాడు. జగపతిబాబు సరసన దర్శకుడు వి. మధుసూదనరావు మనుమరాలు వీరమాచనేని నీలిమ నటించిందని దర్శకుడు అన్నారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని అరుణ్‌ప్రసాద్ తెలిపారు.
జగపతిబాబు మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాత్ర కోసం రోడ్లమీద రకరకాలుగా పుస్తకాలు అమ్మాను. కాస్త సిగ్గుపడ్డాను కూడా. ఇది పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమని, దాదాపు షూటింగ్ పూర్తికావచ్చిందని తెలిపారు. శుభలగ్నంలో ఆమని పోషించిన తరహా పాత్రను నీలిమ పోషించిందని చెప్పారు.
ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. భరణి కె. ధరణ్, సంగీతం.. చక్రి, నిర్మాత.. మురళి.