1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Cinema

Vyapari| Cinema| S.J.Surya| Namitha| Tamanna| Malavika | క్లోనింగ్ నేపథ్యంలో సాగే "వ్యాపారి"

వ్యాపారి
బిల్‌గేట్స్ కంటే ఒక రూపాయి అయినా ఎక్కువ సంపాదించాలనుకునే యువకుడు వ్యాపారంలో బిజీగా ఉంటూ కుటుంబ సభ్యులతో కనీసం ఒక రోజు కూడా గడపలేడు. 

దీంతో తన కుటుంబానికి చేరువగా ఉండే విధంగా క్లోనింగ్ ద్వారా తనలాంటి మరో వ్యక్తిని క్రియేట్ చేస్తాడు. ఇటువంటి వైవిధ్యమైన కథాంశంతో వ్యాపారి అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది.

తమిళంలో ఇదే పేరుతో రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో కూనిరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు తెలుగులోకి అనువదిస్తున్నారు. సోమవారం సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి, కూనిరెడ్డి మాట్లాడుతూ.. ఇందులో ఎస్.జె. సూర్య ద్విపాత్రాభినయం చేశారన్నారు.

తమన్నా, నమిత, మాళవిక హీరోయిన్లుగా నటించారని శ్రీనివాసరెడ్డి చెప్పారు. రొటీన్ చిత్రాలకు భిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని కూనిరెడ్డి తెలిపారు. త్వరలో ఆడియోను, సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రానికి మాటలు, పాటలు: భారతీ బాబు, సంగీతం: దేవా, దర్శకత్వం: శక్తి చిదంబరం.
About Writer
SELVI.M